శ్రీగిడ్డాంజనేయస్వామి హుండీ లెక్కింపు
రూ.9 లక్షల 37 వేల 759
2 కేజీల 600 గ్రాముల వెండి
పెద్దకడబూరు , మార్చి 10, (సీమకిరణం న్యూస్) :
మండల పరిధిలోని తారాపురం గ్రామం లో వెలసిన శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీని బుధవారం ఆలయ అధికారి రమేష్ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు లెక్కించారు. 20 జులై 21 నుండి 09. బుధవారం వరకు స్వామివారి హుండీని లెక్కించగా రూ. 9,37, 759 నగదు ఆదాయంగా తేలింది.2.600 కేజీల వెండి వచ్చింది. సదరు మొత్తం గిడ్డాంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కు గా భక్తులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారి రమేష్ మాట్లాడుతూ స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల కు అవరమైయ్యే వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రతి శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవసరమయ్యే సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా చర్యలు తీసుకొంటున్నట్లు ఈవో తెలిపారు.
తిక్కతాత హుండీ రూ. 26,760
తారాపురం గ్రామంలో ఉన్న శ్రీ తిక్కతాత హుండీని కూడా లెక్కించారు. మొత్తం రూ. 26,760 నగదు విరాళంగా వచ్చింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జునయ్య, ఆలయ సిబ్బంది ఆచారి, ఆలయ అర్చకులు నాగరాజు స్వామి, బసవరాజు స్వామి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.