నాయకుల జన్మదిన వేడుకలు ప్రభుత్వమే నిర్వహించాలి
ఉత్సవ కమిటీ సభ్యుల సూచనలు అభిప్రాయలపై సమావేశం
నాయకుల జన్మదిన వేడుకలు ప్రభుత్వమే నిర్వహించాలి
-: ఉత్సవ కమిటీ సభ్యుల సూచనలు అభిప్రాయలపై సమావేశం
కర్నూలు టౌన్, ఏప్రిల్ 01,(సీమకిరణం న్యూస్) :
నాయకుల జన్మదిన వేడుకలు ప్రభుత్వమే నిర్వహించాలని దళిత సంఘాల నేతలు పేర్కొన్నారు.శుక్రవారం స్థానిక సంక్షేమ భవన్ నందు గల డిడి సోషల్ వెల్పేర్ కార్యలయంలో దేశ నాయకులు డాక్టర్ బాబా సాహెబ్అంబేడ్కర్ .బాబుజగ్జివన్ రాం పెద్దల జన్మదిన వేడుకలు ప్రతి ఏటా ప్రభుత్వం అధికారికంగా జరిపే ఉత్సవ కమిటీ సభ్యుల సూచనలు అభిప్రాయల కై దళిత గిరిజన నాయకుల సమావేశం జిల్లా అధికారి డిడి సోషల్ వెల్పేర్ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో నాయకులు చెప్పిన విషయాలు ప్రతిఏటా ఏవిధంగా దేశనాయకుల జన్మదిన
ఉత్సవం జరుగునో కర్నూలు కలెక్టరేట్ కార్యలయం నుండి జిల్లా కలెక్టర్ అద్వర్యంలో జిల్లా అధికారులు స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతి నిధుల ప్రజసంగాలు, నాయకులు, ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొని సభ వేదిక దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళలన్నారు. సభ ఉత్సవానంతరం అక్కడే భోజనాలు ఉండాలనే అభిప్రాయలు చెప్పారు. ఉత్సవ కమిటీ సభ్యలు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కైలాష్ నాయక్
అలాగే కొమ్ము పాలేం శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు దళిత సమఖ్య యంజే బాబు రాజు, వేల్పుల జ్యోతి, అనంత రత్నం, గోపి రాజ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.