సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయం
కర్నూలు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి టి.జి భరత్
సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయం
-: టి.జి భరత్
కర్నూలు టౌన్, ఏప్రిల్ 01 (సీమకిరణం న్యూస్) :
ప్రజలకు ఏదో ఒక రూపంలో సేవ చేయడం గొప్ప విషయమని కర్నూలు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లా పరిషత్ ఎదురుగా మహోదయ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టి.జి భరత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతేనే బయట తిరగాలన్నారు. ఎండాకాలంలో ప్రజలకు సేవ చేసేందుకు చలివేంద్రాలు ఏర్పాటుచేస్తున్న అందరినీ అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని స్వచ్చంద సంస్థలను కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు శ్రినవాస్, శేషాద్రి, నరేష్, ఆదిత్య, రవి తదితరులు పాల్గొన్నారు.