రోజా దర్గా ఉరుసు మహోత్సవంలో జనసేన పార్టీ నాయకులు
రోజా దర్గా ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు
… చాదర్ వేసి ప్రత్యేక ప్రార్థనలు చేసిననక్కమిట్టల శ్రీనివాసులు , మహబూబ్ బాషా , హసీనా బేగం
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
నగరంలోని రోజా వీధిలో ఉన్న రోజా దర్గా ఉరుసు మహోత్సవం లో జనసేన పార్టీ నాయకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జనసేన పార్టీ నాయకులు నక్కమిట్టల శ్రీనివాసులు మహబూబా భాష, రాయలసీమ విభాగం వీర మహిళ కోఆర్డినేటర్ హసీనా బేగం దర్గా పై చాదర్ వేసి రోజా పూలు వేసి ఫాతిహా ఇప్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు చేసిన వారిలో జనసేన పార్టీ డాక్టర్ అన్వర్ హుస్సేన్ , మణిబాబు, మేరీ, మున్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులు సోదరీమణులు అందరూ అల్లా కృపతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఎండలు ఎక్కువగా వున్న కారణంగా వారిపై అల్లా కృప ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. రోజా దర్గా కు ప్రత్యేకమైన స్థానం ఉందని ఏపీ నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా రోజా దర్గాకు భక్తులు హాజరవుతారని వారు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ ఉరుసు మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు. ఉరుసు మహోత్సవం సందర్భంగా రాజేష్ రెడ్డి , జానీ , జీవన్ పాల్గొని ప్రార్థనలు చేశారు. ఉరుసు సందర్భంగా భక్తులు భారీ ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.