రంజాన్ ప్రత్యేకం హలీం
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ప్రత్యేకంగా హలీం తయారు చేస్తారని 30 రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు కొనసాగుతాయని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. నగరంలోని బిగ్ సి సమీపంలో ఉన్న కేయి ప్లాజా ఎదురుగా ఏర్పాటు చేసిన హలీం సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో తయారుచేసే హలీం ముస్లిం సోదరులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఇష్ట పడతారని ఆయన అన్నారు. హాలీమ్ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అన్నారు. కర్నూలు నగరంలో ముస్లిం సోదరులు 30 రోజుల పాటు ఈ హలీమ్ తయారు చేస్తారని అన్నారు. కర్నూలు నగరంలో దాదాపు 40 ప్రాంతాలలో తయారు చేస్తారని అన్నారు. కర్నూలు నగరం మతసామరస్యానికి చిహ్నంగా ఉంటుందని బక్రీద్ పండుగను కులమతాలకతీతంగా సోదరభావంతో జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయెఖా హలీం తయారీదారుడు ఎస్ ఎన్ డి జాహిద్ హుస్సేన్, వైఎస్ఆర్సిపి నాయకులు నాయకల్లు ప్రసాద్, చాట్ల నవీన్, సత్రాల రాజేష్, మైకేల్, ఏలియ, మైనారిటీ కమిటీ సభ్యులు నిసార్ అహ్మద్, సాదక్ హుస్సేన్, ఇస్మాయిల్ , ఆవాజ్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్లా , అబ్దుల్ రెహమాన్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు.