రాష్ట్రానికి క్రీడలలో కీర్తి ప్రతిష్టలు
అంతర్జాతీయ స్థాయిలో దేశానికీ , రాష్ట్రానికి క్రీడలలో కీర్తి ప్రతిష్టలు
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
అంతర్జాతీయ స్థాయిలో దేశానికీ , రాష్ట్రానికి క్రీడలలో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన విశాఖపట్నం కి చెందిన శ్రీమతి యన్. ఉష (బాక్సింగ్ విభాగములో -ధ్యాన్ చాంద్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత) మరియు కర్నూల్ కి చెందిన షేక్ జఫ్రీన్ (డెఫ్ టెన్నిస్ విభాగములో-జాతీయ స్థాయిలో బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ విత్ డిజాబిలిటీ అవార్డు గ్రహీత) ఈ విధముగా అవార్డులు సాధించిన ఇరువురిని క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. యన్. ప్రభాకర రెడ్డి ఐ. ఎ. యస్ .శుభకృత నామ సంవత్సర ఉగాది నాడు శాప్ కార్యాలయము లో వారిని క్రీడా ప్రాధికార సంస్థ తరఫున సన్మానించారు .ఇలాగే వారు మరిన్ని పతకాలు సాధించాలని కోరారు .రాష్ట్రంలో ఇంకా ఎందరో క్రీడాకారులను తీర్చిదిద్దటానికి ,వారిలోని ప్రతిభను గుర్తించడానికి శాప్ లీగ్ లను నిర్వహిస్తుందని ,రాష్ట్రము లో ఇప్పటికీ 26000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించటానికి శాప్ ఎప్పుడు వారికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు.