కర్నూలు రేంజ్ నూతన డిఐజి గా ఎస్. సెంథిల్ కుమార్
కర్నూలు రేంజ్ నూతన డిఐజి గా బాధ్యతలు చేపట్టిన ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్
నూతన డిఐజి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన… కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్
ఐజిపి ట్రైనీ గా పి. వెంకటరామిరెడ్డి బదిలీపై వెళ్లారు.
కర్నూలు క్రైమ్, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు రేంజ్ నూతన డీఐజీగా ఎస్.సెంథిల్ కుమార్ ఐపియస్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో నూతన డిఐజి గా ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ పదవీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన డీఐజీ ఎస్.సెంథిల్ కుమార్ ఐపియస్ గారిని కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు కర్నూలు రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ మీడియాతో కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో మాట్లాడాతారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు ఉన్నారు.
ఎస్ . సెంథిల్ కుమార్ ఐపియస్ గారి గురించి….
సెంథిల్ కుమార్ ఐపియస్ గారి తల్లిదండ్రులు : శ్రీమతి సరస్వతి , శ్రీ శివరాజ్ ( ఇద్దరు విశ్రాంత ఉపాధ్యాయులు )
చదువు : బీఎస్సీ ( గణితం ).
స్వగ్రామం : కోయంబత్తూరు జిల్లా. ఉడుముల్ పేట ( తమిళనాడు రాష్ట్రం ) గ్రామానికి చెందిన వారు.
తొలుత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. తర్వాత ఐపియస్ కు ఎంపికయ్యారు.
2003 నుంచి 2007 వరకు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేశారు . ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు . సివిల్స్ నాల్గవ సారి రాసి 2008 లో ఐపీయస్ ఎంపికయ్యారు .
పనిచేసిన ప్రాంతాలు….
2010 లో శిక్షణ పూర్తి చేసుకున్న ఆయన 2010 గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ గా పనిచేశారు . 2011 నుంచి 2013 వరకు వరంగల్ జిల్లా ములుగు ఏఎస్పీగా పనిచేశారు .
2013 లో శ్రీకాకుళం జిల్లా ఏఎస్పీ అడ్మిన్ గా, అదే సంవత్సరంలో హైదరాబాద్ లోని షంషాబాద్ డిసిపీగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు.
2013 లో అనంతపురం జిల్లా ఎస్పీ గా నియమితులయ్యారు.
2014 నుండి 2015 వరకు నెల్లూరు జిల్లా ఎస్పీ గా, 2015 నుంచి 2017 గ్రే హౌండ్స్ గ్రూపు కమాండర్ గా విధులు నిర్వహించారు.
2017 నుంచి 2019 వరకు విజయవాడలో ఇంటలిజెన్స్ ఎస్పీగా పనిచేశారు.
2019 నుండి 2021 వరకు చిత్తూరు జిల్లా ఎస్పీ గా పని చేశారు.
2021 డిసెంబర్ 31 న చిత్తూరు జిల్లా ఎస్పీ గా పని చేస్తూనే డిఐజి గా పదోన్నతి పొందారు.
2022 నుండి చిత్తూరు జిల్లా డిఐజి గా పని చేస్తూ బదిలీ పై కర్నూలు రేంజ్ డిఐజి గా ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు.