వైభవంగా సలాం బాబా గంధమహోత్సవం
వైభవంగా సలాం బాబా గంధమహోత్సవం
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
ఏఎస్ పేట మండల కేంద్రంలో కొండపై వెలసివున్న హజ్రత్ సయ్యద్ అజీజ్ బాబా పెద్ద కుమారుడు సయ్యద్ సలాం బాబా గంధ మహోత్సవం శనివారం రాత్రికి రంజాన్ నెలవంకను చూసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సలాం బాబా ఇంటి నుండి గంధమును కలిపి గంధ కలశమును సలాం బాబా మనవడు అబ్దుల్ అజీజ్ నాయబ్ తలపై ఉంచి బాణసంచా కాలుస్తూ ఫకీర్ల జలుబు లతో భక్తి కీర్తనల నడుమ ముందుగా స్థానికంగా ఉన్న పెద్ద దర్గా ఖాజా నాయబ్ రసూల్ స్వాములవారి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మరో ప్రముఖ దర్గా ఫక్రుద్దీన్ బాబా దర్గా లో ప్రార్థనలు నిర్వహించి అక్కడినుండి అజీజ్ బాబా దర్గా లో ప్రార్థనలు చేసి సలాం బాబా దర్గా కు చేరారు. అక్కడ గంధమును సలాం బాబా సమాధికి గంధ లేపనం చేసి ప్రత్యేక సలాములు పాడి ఫాతిహ చదివారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. గంధ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గంధ మహోత్సవ కార్యక్రమంలో సలాం బాబా కుమారులు రహమతుల్లా ,గౌస్ బాష భక్తులు పాల్గొన్నారు.