శ్రీ సత్య సాయి జిల్లా నూతన ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్
శ్రీ సత్య సాయి జిల్లా నూతన & తొలి ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్ IPS బాధ్యతలు స్వీకరణ
* కొత్త జిల్లాలో పోలీసు పరమైన పాలనలో అన్నింటా శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ వినాయక స్వామి పూజ చేసి నూతన ఎస్పీ పుట్టపర్తి ధర్మశాలలోని తన ఛేంబర్లో చార్జి తీసుకున్నారు.
* నూతన ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ IPS గారికి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS
* ఆధ్యాత్మికంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న పుట్టపర్తి జిల్లా కేంద్రంగా శ్రీ సత్య సాయి నూతన జిల్లాకు తొలి మరియు కొత్త ఎస్పీగా నియమించడం ఆనందంగా ఉందన్న నూతన ఎస్పీ
* తనకు ఈ అవకాశం కల్పించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS గారికి ప్రత్యేక కృతజ్ఞతలు
* జిల్లాల పునర్విభజనలో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లాగా ఏర్పాటై రేపు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.
* రేపటి నుండీ కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు రథసారథిగా రాహుల్ దేవ్ సింగ్ IPS బాధ్యతలు చేపట్టి నూతన జిల్లాలో పరిస్థితులను అధ్యయనం చేసుకుని సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తామని వెల్లడి
* జిల్లాను ప్రశాంతంగా ఉంచేలా నూతన జిల్లా పోలీసు సిబ్బంది మరియు ఇతర ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో ముందుకెళ్తామని స్పష్టీకరణ
* శ్రీ సత్యసాయి జిల్లాలోని సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమావేశమై దిశానిర్ధేశం చేసిన నూతన ఎస్పీ
* ఈకార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, డీఎస్పీలు ఆర్ల శ్రీనివాసులు, రమాకాంత్ , భవ్యకిశోర్ , ఎన్ రమ్య, తదితరులు