అట్టహాసంగా రాష్ట్ర స్థాయి బండలాగు పోటీలు ప్రారంభం
అట్టహాసంగా రాష్ట్ర స్థాయి బండలాగు పోటీలు ప్రారంభం
కోడుమూరు, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
పట్టణ శివారులో హంద్రీనది ఒడ్డున వెలసిన శ్రీ వల్లెలాంభ దేవి ఉగాది ఉత్సవాలలో భాగంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారకార్థం ఆదివారం రాష్ట్ర స్థాయి వృషభరాజముల బండలాగు పోటీలు ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.ఈ పోటీలను కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.ముందుగా ఉదయం కోడుమూరు చేరుకున్న కోట్ల హర్షకు స్థానిక కోట్ల సర్కిల్ వద్ద పోటీల నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.అక్కడి నుంచి పట్టణంలోని పురవీధుల గుండా డప్పుచప్పుళ్లు, మేళతాలలతో దారిపొడువునా పూలవర్షం కురిపిస్తూ,బాణసంచా పేల్చుతూ అమ్మవారి ఆలయ ప్రాంగణం చేరుకున్నారు.అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి డాక్టర్ వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.పోటీల్లో మొదటి రోజు పాలపళ్ల సైజు విభాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11ఎద్దుల జతలు పోటీపడ్డాయి.ఉత్కంఠభరితంగా సాగిన పోటీలలో అనంతపురం జిల్లా గుత్తి మండలం నేమతాబాద్ గ్రామానికి చెందిన టెంకాయల వెంకటేష్ ఎద్దుల జత మొదటి బహుమతి రూ.50వేలు గెల్చుకోగా,గద్వాల జిల్లా జమ్మిచేడు గ్రామానికి చెందిన వెంకటేష్ తోపాటు సి బెళగల్ మండలం ఇనగండ్ల గ్రామానికి చెందిన బాయికాటి బోడన్నల కంబైండ్ జత రెండవ బహుమతి రూ.40వేలు గెలుచుకున్నారు.అలాగే వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం మోసానిపల్లి గ్రామానికి చెందిన సాకం బ్రహ్మానందరెడ్డి ఎద్దులు మూడో బహుమతి గెలుచుకున్నాయి.ఇదిలా ఉండగా శనివారం కోడుమూరు పట్టణ శివారులో హంద్రినది ఒడ్డున వెలసిన శ్రీవల్లెలాంబ దేవాలయంలో జాతర మహోత్సవాల భాగంగా శనివారం సాయంత్రం రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.మోదీ రథోత్సవాన్ని తిలకించేందుకు పట్టణంలోని ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయింది.రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహం చేర్చి భక్తులు వల్లెలాంభదేవి మాతాకీ…జై..జై అంటూ జేజేలు పలుకుతూ రథాన్ని ముందుకు లాగారు.రథోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ వీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎస్ఐ విష్ణునారాయణ పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం రాత్రి వివిధ పాఠశాలల విద్యార్థులతో ఏర్పాటు చేసిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు అబ్బురపరిచాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి కోడుమూరు ప్రజలు,భక్తాదులు, వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ప్రేక్షకుల ఆనందం కోసం ప్రత్యేకంగా ఆకాశంలో హరివిల్లులో భాగంగా పేల్చిన బాణాసంచా అందరిని ఆకట్టుకుంది. కోట్ల హర్షవర్ధన్ రెడ్డి,కోట్ల కళావతమ్మ పేరులతో మూడు ప్రత్యేక ఎయిర్ బెలూన్ లను దీపాలు వెలిగించి గాలిలోకి విడిచి పెట్టారు.అనంతరం కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి సారధ్యంలో కీ.శే కోట్ల కళావతమ్మ జ్ఞాపకార్థం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమాన్ని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, గుజరాతి లావణ్య,వైస్ ఎంపీపీ లక్ష్మిదేవి చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.కార్యక్రమంలో చిన్నారుల డ్యాన్స్ విజేతలను ఎంపిక చేసేందుకు శెట్టి అమరేష్,సుధ జడ్జిలుగా వ్యవహరించారు.కాగా ఈ పోటీల్లో మొదటి బహుమతి విజేత శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు కైవసం చేసుకోగా,రెండవ బహుమతిని ఠాగూర్ విద్యానికేతన్ పాఠశాల, మూడవ బహుమతి విజేత శ్రీనివాస లిటిల్ ఛైల్డ్ విద్యార్థులు గెలుపొందారు.కన్సోలేషన్ బహుమతులను విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల,రామన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులకు కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలోమాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్, రమేష్ నాయుడు, క్రిష్ణారెడ్డి, రవిరెడ్డి, వీర, ప్రకాష్, భాస్కర్, దస్తగిరి, మద్దిలేటి, జగదీష్, సాయి,రాఘవేంద్ర,లింగన్న, దివాకర్ నాయుడు,రఘు,పూలవాసు, సుబ్బారావు స్వామి,హనుమంతు, వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ,వార్డు మెంబర్లు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.