వరి రైతుకు కన్నీటిపాలు…..

వరి రైతుకు కన్నీటిపాలు
నిల్వ వుంచలేక నానా యాతన పడుతున్న రైతులు
గత్యంతరం లేక తక్కువ ధరలకు వ్యాపారులకు విక్రయం
టిడిపి రాష్ట్ర కార్యదర్శి దావా పెంచల రావు
ఆత్మకూరు, సంగం, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
సంగం,హామీని విస్మరించి ఒక్క గింజ కూడా వదలకుండా కొంటామన్న ప్రభుత్వం, రైతులు పండించిన వడ్లకు గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం పెట్టిన ఆంక్షలుకు (తేమశాతం,దుమ్ము,దూళి, తరక ఉండకూడదు) వడ్లను నిల్వవుంచలేక ,అరబెట్టడానికి సౌకర్యంలేక నానా యాతన రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర టిడిపి కార్యదర్శి దావా పెంచల రావు పేర్కొన్నారు.ఈ సందర్భంగాఆయన మండల కేంద్రమైన సంఘం ముంబై హైవే వద్ద ఉన్న టిడిపి కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో శనివారం మాట్లాడుతూ ప్రకృతిని నమ్మలేక ఎప్పుడు వర్షం ముంచుకొస్తుందో తెలియక గత్యంతరం లేక సహనం నశించిన రైతులు తానంతట తానుగా వ్యాపారుల వైపు మొగ్గుచూపి వ్యూహాత్మకంగా వ్యవహరించి పంటను తక్కువ ధరకే అమ్ముకుంటున్నారనీతెలిపారు. హామీని విస్మరించిన ప్రభుత్వం వరి రైతును క’న్నీటి’పాలు చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.ఆత్మకూరు నియోజకవర్గంలో వరి పండించిన రైతులు గత్యంతరం లేక తక్కువ ధరకే పుట్టి (850.కెజిలు)14.600 కు స్వయంగా వ్యాపారులకు అమ్మి
వచ్చిన దానిలోనే సంతృప్తిని వ్యక్తం చేస్తూ రైతు భరోసా కేంద్రాలపై ప్రభుత్వ విధానాల తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.గత 20రోజులుగా గ్రామంలో వరికోతలు నూర్పిడి మొదలై ఎండబెట్టడానికి ఇబ్బదులును ఎదుర్కొంటూఉంటే రైతు భరోసా కేంద్రం వారు వ్యవసాయ అధికారులు నోరు మెదపలేదని ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని. దీనికి తోడు కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం పాడవుతుందేమోనని భయంతో. ప్రైవేటు వ్యాపారులుకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నామని ఆత్మకూరు నియోజకవర్గం రైతులు తెలియజేసారు.ఇప్పటి కైనా జిల్లాలోని రైతు కష్టాన్ని గుర్తించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను
ప్రారంభించి గత్యంతరం లేక తక్కువ ధరలకు ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయం చేస్తున్న
రైతులకు అండగా నిలుస్తారని వ్యవసాయ అధికారులనుకోరుతున్నామన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరచి రైతు కష్టాలను గమనించి వారికి న్యాయం చేసే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.