పోలీసు స్పందన కార్యక్రమం తాత్కలిక రద్దు…
కర్నూలు క్రైమ్, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు టు టౌన్ పోలీసుస్టేషన్ ప్రక్కనున్న స్పందన భవనంలో సోమవారం జరగబోయే ” స్పందన కార్యక్రమము”ను తాత్కలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపు నంద్యాల నూతన జిల్లా గా ప్రారంభ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు అందుబాటులో లేకపోవడం వలన సోమవారం సోమవారం జరిగే స్పందన కార్యక్రమం వాయిదా పడింది.సుదూర ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో జిల్లా ఎస్పీ గారి స్పందన కార్యక్రమం కు రావొద్దని, ప్రజలు (ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వచ్చే సోమవారం ఏప్రిల్ 11 నుండి “ స్పందన కార్యక్రమం” యధావిధిగా కోనసాగుతుంది.