ANDHRA
బైక్‌లకు శాపంలా మారిన వేసవి తాపం
కసాపురం, ఏప్రిల్ 03, (సీమకిరణం న్యూస్) :
వేసవి తాపం బైక్‌లకు శాపంలా మారింది. ఇటీవల కాలంలో రోజూ ఏదో మూలన బైక్‌లు, స్కూటర్లు ‘వేడి’కి ఆహుతి అవుతున్న సందర్భాల్లో తరచు చూస్తున్నాం. తాజాగా బుల్లెట్ బండి ఉన్నపళంగా పేలిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది గుంతకల్లు మండలం కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఓ బుల్లెట్ పేలిపోయింది. నూతనంగా కొనుగోలు చేసిన బుల్లెట్‌కు పూజ చేస్తుండగా బైక్ పేలిపోయింది. దాంతో స్థానికంగా ఆందోళన చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బైక్ మాత్రం దాదాపు దగ్ధమైంది.