26 జిల్లాలను వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి

26 జిల్లాలను వర్చువల్‌గా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి :-
కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో సుస్థిర ప్రగతికి బాటలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం –
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-
కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్ వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది
– కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య :-
అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం –
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ :-
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వాగ్దానాన్ని కార్యరూపం దాల్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి –
కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె. సుధాకర్ :-
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :-
కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో సుస్థిర ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేసింది అని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు తెలిపారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి 13 కొత్త జిల్లాల ఏర్పాటుతో పునర్ వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ ను వర్చువల్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ 13 జిల్లాలు గల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో 13 కొత్త జిల్లాల ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైన రోజు అని అభివర్ణించారు. జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరభారం తగ్గనుంది అని, జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుందన్నారు. ప్రజల ఇంటి వద్దకు పాలన ద్వారా జవాబుదారీతనం ఇంకా పెరగనుంది అన్నారు. పాలనాపరంగా పర్యవేక్షణ పెరగనుందన్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాల పై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా మరింత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు.
కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్ వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది – కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య :-
కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్ వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది అని కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య అన్నారు. అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, బడుగు, బలహీన వర్గాల వికాసంతో పాటు సుస్థిర ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తుందన్నారు.
అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం – కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ :-
అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేసింది అని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా పాలన సామాన్య ప్రజలకు, బడుగు, బలహీన వర్గాలకు చేరువుగా ఉండాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ పారదర్శకంగా, ఇంకా మెరుగ్గా అందాలనే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు నాంది పలికారన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వాగ్దానాన్ని కార్యరూపం దాల్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి – కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె. సుధాకర్ :-
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వాగ్దానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యరూపం దాల్చారని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్ అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశ్యంతో జిల్లాలు ఏర్పాటు చేసి అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ప్రజలు గురించి ఆలోచన చేయలేదని, జగనన్న ప్రజల గురించి ఆలోచన చేసి అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు పాలన చేరువయ్యేలా కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటుకు కార్యరూపం దాల్చి ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, కర్నూలు రేంజ్ డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కర్నూలు డిఆర్ఓ ఎస్వీ నాగేశ్వర రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.