శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయo
-: కర్నూలు రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్
కర్నూలు క్రైమ్, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని కర్నూలు రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్ పేర్కొన్నారు.
సోమవారం కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో జిలా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, సెబ్ అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి కర్నూలు రేంజ్ డిఐజి సెంథిల్ కుమార్ మిడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ తాను కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో కర్నూలు రేంజ్ డిఐజి గా ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. కర్నూలు రేంజ్ క్రింద గతంలో కర్నూలు , కడప 2 జిల్లాలు మాత్రమే ఉండేవన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం కర్నూలు రేంజ్ లో కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాలు ఉన్నాయన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ SOS యాప్ ను ప్రతి మహిళ ఇన్ స్టాలేషన్, రిజిస్ట్రేషన్ చేసుకునేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు ఏక్కడైనా అత్యవసర ఇబ్బందులు, వేధింపులకు గురైనప్పుడు దిశా SOS యాప్ బటన్ నొక్కడం లేదా ఆ మొబైల్ ను పలు సార్లు కదలికలు చేయడంతో కంట్రోల్ రూమ్ పోలీసు లకు సమాచారం వస్తుందన్నారు.పోలీసు బృందాలు అక్కడి లోకేషన్ తెలుసుకుని వెళ్ళి బాధిత మహిళలను రక్షించడం జరుగుతుం దన్నారు. మహిళల పై జరిగే నేరాలను అరి కట్టేందు గట్టి చర్యలు చేపడతామన్నారు. పోక్సో యాక్ట్ కేసులలో దర్యాప్తు చేయడమే మాత్రమే కాకుండా మానిటరింగ్ చేస్తూ కేసుల ట్రయల్ కూడా సరైన సమయంలో చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు.స్పందన కార్యక్రమం లో భాగంగా పోలీసుస్టేషన్ ను ఆశ్రయించే ప్రతి బాధితుడి సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. ఫారెస్ట్ ఏరియాలలో నాటుసారా అరికట్టడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామ న్నారు. సెబ్ అధికారులు విస్తృతంగా దాడులు, కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహిస్తున్నారన్నారు. అంతర్ రాష్ట్ర , అంతర్ జిల్లా సరిహద్దు ప్రాంతా లలో తెలంగాణ, కర్ణాటక బార్డర్ ప్రాంతాల నుండి మద్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపడతామన్నారు. పోలీసు అధికారులు అందరూ బాగా పని చేస్తున్నారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కొత్తగా ఏర్పాటైన నంద్యాల, అన్నమయ్య జిల్లాలో అన్ని మౌలిక సదుపాయల నిర్మాణాలను సిధ్దం చేసి ఉంచామ న్నారు. పోలీసు మ్యాన్ పవర్ ను పెంచి, సజావుగా జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రజలు, మిడియా కూడా పోలీసుశాఖ కు తమ వంతుగా సహాకరించాలన్నారు. రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి తిరుమలేశ్వర రెడ్డి, డిఎస్పీలు వెంకట్రామయ్య, యుగంధర్ బాబు, ఇలియాజ్ భాషా, రవీంద్రారెడ్డి, డిఐజి లైజనింగ్ ఆఫీసర్ సునీల్ , ఆర్ ఐలు శివారెడ్డి, వియస్ . రమణ, ఆర్ ఎస్సైలు డిఐజిని మర్యాపూర్వకంగా కలిసి పూల బొకెలు అందజేశారు.