మొక్కలు నాటిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను
శ్రీకాకుళం జిల్లాలో ఏప్రిల్ 4న ప్రారంభమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వారోత్సవాలు…
శ్రీకాకుళం , ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :
ప్రముఖ సినినటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా తొలిరోజైన సోమవారం టీమ్ అల్లు అర్జున్ శ్రీకాకుళం అభిమానులు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో టీమ్ అల్లు అర్జున్ అభిమానుల నిర్వహణలో మెగా అభిమానులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను తో పాటు ఇతర మెగా ఫ్యామిలీ అభిమానులు కలిసి శ్రీకాకుళం నగరంలోని ఆర్Êబి అతిథి గృహం దగ్గరలో మొక్కలు నాటారు. హరిత ఉద్యమంలో భాగంగా వారంతా కలిసి ఆ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తైక్వాండో శ్రీను మాట్లాడుతూ అఖిల భారత చిరంజీవి యూవత పిలుపు మేరకు ప్రతి ఏడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదినోత్సవం సందర్భంగా వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నా మన్నారు. ఆందులో భాగంగా ఈ ఏడాది కూడా వారోత్సవాల నిర్వహణలో భాగంగా తొలిరోజు మొక్కలు నాటే కార్యాక్రమం నిర్వహించామన్నారు. జీవ కోటికి ప్రాణాధారమైన మొక్కలను పెంచడం కోసం తమవంతు కృషి చేస్తామన్నారు. మెగాఫ్యామిలీ అభిమానులందరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ వాటి పెంపకం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలన్నారు. మొక్కలను విరివిగా పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపడడం ద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడవచ్చన్నారు. హరిత ఉద్యమంలో మెగా అభిమానులు పాల్గోని జయప్రదం చేయాలని తైక్వాండో శ్రీను కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి వైశ్యరాజు మోహన్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షులు పుక్కల నవీన్, టీమ్ సభ్యులు భాను, బన్నీ, గిరి, భాస్కర్, వెంకీ, గణ, నాని, హేము, టీమ్ రామ్ చరణ్ యువత జిల్లా అధ్యక్షుడు తైక్వాండో గౌతమ్, షేక్ మదినా, చరణ్ తేజ, శివ చెర్రీ, జిల్లా పవన్ కళ్యాణ్ అధ్యక్షులు కిరణ్ కిర్రు, పెయ్యల చంటి, సంతోష్, సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షుడు జోగిపాటి వంశీ, జిల్ల్లా వరుణ్ తేజ అభిమాన సంఘ అధ్యక్షుడు శీర రాజు, పంకు మురళి తదితరులు పాల్గొన్నారు.