రాష్ట్ర చరిత్రలోనే ఇదొక చరిత్రాత్మక ఘట్టం
రాష్ట్ర పరిపాలనా చరిత్రలో నవశకానికి నాంది
సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి
ఎమ్మిగనూరు, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :
పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే, కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానున్న శుభసందర్భంగా, దీన్ని స్వాగతిస్తూన్న సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో స్దానిక సంప్రదాయాలు, సంస్కృతులు ప్రతిబింబించేలా కార్యక్రమలు నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదు.. పాలన సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఉండాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ పారదర్శకంగా, ఇంకా మెరుగ్గా అందాలన్న సమున్నత లక్ష్యంతో మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని నేరవేరుస్తూ, రాష్ట్ర పరిపాలనా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, 42 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత కొత్త జిల్లాలు.. ఏడు దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో రెండే కొత్త జిల్లాలు.. నేడు ఏకంగా 13 కొత్త జిల్లాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు. ఇచ్చిన హామీని అమలుచేస్తూ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే ఇదొక చరిత్రాత్మక ఘట్టం. ఈ మేరకు జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేశన్న , సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెయస్. రఘు , వైస్ చైర్మన్ లు డి. నజీర్ ఆహ్మద్, కె. దివ్వకళ సునీల్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, మైనార్టీ నాయకులు రియాజ్ ఆహ్మద్, కో ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, పట్టణ మరియు గ్రామీణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.