
సర్వమానవాళికి మార్గదర్శనం “” ఖురాన్””
మర్రిపాడు, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :
దేశంలో ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైన సందర్బంగా మర్రిపాడు మండలం పడమటి నాయుడు పల్లి గ్రామంలోని ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్నారు స్థానిక కాకతీయ న్యూస్ ప్రతినిధి మసీదు కమిటీ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహిస్తున్న హిమాం అబ్దుల్ రజాక్ ను పలకరించగా ,సర్వమానవాళికి మార్గదర్శకమైన ఖురాన్ గ్రంథం అవతరించిన నెల రంజాన్.అని క్రమశిక్షణ, దాతృత్వం, ఆధ్యాత్మిక చింతన ఈ మూడింటి కలయికే రంజాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో తమ జీవనాన్ని కొనసాగిస్తారు అని తెలియజేసారు. ఈ నెలలోప్రతి ముస్లిం కఠోర నియమాలు పాటిస్తారు. ఈ నియమాల వెనుక ఉతమ జీవన విధానం దాగుందని ఖురాన్ చెబుతోంది. ఈ నెలలో ప్రతి ముస్లిం క్రమం తప్పకుండా ఉప వాసం ఉండటంతో పాటు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు. ఈ నెలంతా విధిగా ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. దీని ప్రతిఫలము స్వర్గము లభిస్తుందని, ప్రజలతోమంచిగా వ్యవహరించే అవకాశం కలుగుతుందని. ఈ పవిత్ర నెలలో ఉపవాసికి పేదవారి ఆకలి దప్పికలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అలాంటి వారికి సహాయం చేస్తే అతడి పాపాలు క్షమించబడతాయి.ఈ మాసంలో అనేక సత్కార్యాలను ముస్లింలు ఆచరిస్తారు. దానధర్మాలు చేయడం (జకాత్), కుల మతాలకు అతీతంగా విందులు ఇవ్వడం (ఇఫ్తార్) చేస్తారు. వీటి వల్ల మనమంతా ఒక్కటే అన్న భావన అందరిలోనూ కలుగుతుంది. ఇక రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయడం వల్ల శరరీం, మనసు అదుపులో ఉంటాయి. భక్తి భావం పెరగడం వల్ల ఆత్మ పరిశీలన చేసుకోవడంతో పాటు గతంలో జరిగిన తప్పులు భవిష్యత్
లో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రంజాన్ నెల రాగానే స్వర్గపు కృపా, ఆకాశ ద్వారాలు తెరవబడతాయి. ఏవ్యక్తి అయితే విశ్వాసం, పుణ్యప్రాప్తి తలంపుతో రంజాలో ఉపవాసం ఉంటాడో అతడి మునుపటి పాపాలు క్షమించబడతాయి. ఉపవాసికి రెండు సంతోషాలు ఉన్నాయి. ఒకటి ఇఫ్తార్ సమయం, రెండోవది తన సృష్టికర్తను కలుసుకొనే సమయం. అందువలననే ఈ రంజాన్ మాసంలో ప్రపంచంలోని ముస్లిం సోదరులు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని పడమటి నాయుడు పల్లి గ్రామానికి చెందిన మసీదు కమిటీ హిమాం అబ్దుల్ రజాక్, తెలిపారు ఈ కార్యక్రమంలో షాహుల్, ముజామిల్, అబ్దుల్ రజాక్,హుస్సేన్ బాషా,సంధాని,ఖాజామోహిద్దీన్,
నాయబ్ రసూల్ తదితర ముస్లిం సోదరులు
పాల్గొన్నారు.