ఘనంగా కోట్ల సుజాతమ్మ జన్మదిన వేడుకలు..
ఘనంగా కోట్ల సుజాతమ్మ జన్మదిన వేడుకలు..
గూడూరు, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :
స్థానిక తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి సతీమణి ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ కోట్ల సుజాతమ్మ జన్మదినం సందర్భంగా కోట్ల టీం ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొదటిగా పదో వార్డులోని శ్రీ రాముల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కమ్యూనిటీ హాల్ నందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపు కున్నారు.పుట్టిన రోజును పురస్కరించుకొని పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో లో నీటి సంఘం మాజీ అధ్యక్షులు చెట్టుకింద మద్దిలేటి,టిడిపి కౌన్సిలర్ సురేష్ పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి కోడుమూరు షాషావలి, తెలుగు యువత టౌన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, నాయకులు నాగరాజు,రైతు సంఘం కార్యదర్శి రేవుల గోవిందు,వాల్మీకి సంఘం వైస్ ప్రెసిడెంట్ సంగాల మధు,కిషోర్ వర్మ, నారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు.