రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు శుభపరిణామం
రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు శుభపరిణామం
ఆత్మకూరు ,ఏప్రిల్ 04 ,(సీమకిరణం న్యూస్) :
కరివేన గ్రామ సమీపంలోని సిరికల్చర్ ఆఫీస్ లో నూతనం గా ఏర్పాటు చేసిన రెవిన్యూ డివిజన్ అధికార కార్యాలయా న్ని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ లు ప్రారంభించారు. ఆత్మకూరు ఆర్డీవోగా దాస్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న కల ను నిజం చేశారని తెలిపారు. నూతన జిల్లాల ఏర్పాటు ఓ చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. రాష్ట్రం వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలోనే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని కొని యాడారు. ఆత్మకూరు ప్రాంతం లో రెవెన్యూ డివిజన్ కార్యాల యం ఏర్పాటు చేయడం శుభపరిణామని తెలిపారు. ఆత్మకూరు ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ, ప్రజా ప్రతినిధులు, వైస్సార్సీపీ మండల నాయకులు, కార్యాకర్తలు పాల్గొన్నారు.