CRIME
స్కూటర్ ఢీకొని వ్యక్తి మృతి

స్కూటర్ ఢీకొని వ్యక్తి మృతి
పెద్దకడబూరు,టౌన్, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :
మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామ శివారులో ఆదోని రహదారిలో స్కూటర్ ఢీకొని పెద్దకడబూరు గ్రామానికి చెందిన సామేలు (60) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఏఎస్ఐ నటరాజు సోమవారం విలేఖరులకు తెలిపారు. ఆదివారం రాత్రి మృతుడు సామేలు రాత్రి పొలంలోని మామిడి చెట్ల వద్దకు కాపలా కోసం ఆదోని రహదారిలో కాలినడకన వెళుతుండగా ఎదురుగా స్కూటర్ పై వస్తున్న మాల మురళి బలంగా ఢీ కొట్టినట్లు, దీంతో సామేలు తలకు బలమైన రక్త గాయమైందని వెల్లడించారు. చుట్టుపక్కల వారు అప్రమత్తమై 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ఆదోనికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడని తెలిపారు. మృతుడి కుమారుడు హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ విలేకరులకు తెలిపారు.