అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవనరామ్

అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవనరామ్
— రాయలసీమ శకుంతల
కర్నూలు టౌన్, ఏప్రిల్ 05, (సీమకిరణం న్యూస్) :
సమాజంలో పేద అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జివనరామ్ అందించిన సేవలు ఆచరణీయమని రాయలసీమ మహిళ సంఘ్ అధ్యక్షురాలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రకార్యదర్శి, పొదుపు మహిళల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, వైసీపీ మహిళా నాయకురాలు గోరంట్ల శకుంతల అన్నారు. దూరదృష్టితో దేశ రాజకీయాలను జగ్జివనరామ్ దిశానిర్దేశం చేశారని శకుంతల పేర్కొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు నగరంలోని అశోక్ నగర్ పట్టణ నిరాశ్రయుల వసతి గృహ కేంద్రంలో మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శకుంతల మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధునిగా బాబు జగ్జీవనరామ్ దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సమర్ధుడైన పరిపాలకునిగా దేశానికి నిష్కళంకమైన సేవలు అందించారని సమాజంలో పేద బడుగు బలహీన వర్గాల హక్కులకోసం నిరంతరం పోరాటం చేశారన్నారు. జగ్జీవనరామ్ 35 ఏళ్ల పాటు క్యాబినెట్ మంత్రిగా దేశ ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించి అనేక శాఖలు నిర్వహించారని అలాంటి మహోన్నతుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడిచి ఆయన ఆశయాల కోసం పోరాటం చేయాలని శకుంతల పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వసతిగృహ కేర్ టెకర్ లతశ్రీ, నిరాశ్రయు మహిళలు పాల్గొన్నారు.