ఎమ్మెల్యే ఆర్థర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ గారి ఆధ్వర్యంలో భారీ వైయస్సార్ బైక్ ర్యాలీ
నందికొట్కూరు, ఏప్రిల్ 05, (సీమకిరణం న్యూస్) :
నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపేందుకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పెద్దఎత్తున అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. సాంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, ప్రజల నినాదాలు, బాణాసంచా కాల్పులతో దద్దరిల్లిన నందికొట్కూరు నియోజకవర్గం..బ్రాహ్మణ కొట్కూరు నుండి నందికొట్కూరు పటేల్ సెంటర్ వరకు కదంతొక్కిన జనం. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా పాలనా సౌలభ్యం కోసం, 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రాన్ని, 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో వికేంద్రీకరణలో భాగంగా ప్రతి పార్లమెంట్ ను ఒక జిల్లాగా చేస్తామని స్పష్టంగా ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం హామీని అమలు చేశారు.. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు,ఉదయ్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, ఇన్యతుల్ల, బన్నూరు, జాన్, ధర్మారెడ్డి, చిట్టి రెడ్డి, భాస్కర్, కో ఆప్షన్ నెంబర్స్ సయ్యద్ ముర్తుజావలి, బాలస్వామి, జగన్ రఫీ,మహేష్ బాలకృష్ణ, విక్టర్, జాన్, దిలీప్, పోతులపాడు శివానందరెడ్డి, కరుణాకర్ రెడ్డి, దామగట్ల రత్నం తదితర నాయకులు పాల్గొన్నారు