ముఖ్యమంత్రి నంద్యాల జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్.
నంద్యాల ప్రతినిధి, ఏప్రిల్ 07, (సీమకిరణం న్యూస్) :
నూతన నంద్యాల జిల్లాగా ఏర్పడిన నంద్యాల జిల్లాకు మొట్టమొదటిసారిగా నేడు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామున్ గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ని హెలిపాడ్ మైదానాన్ని ఎస్పీజీ గ్రౌండ్లో నిర్వహిస్తున్న బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలను అధికారులకు ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ లో నంద్యాల జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ రఘువీరా రెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, ఉమ్మడి జిల్లాల జే సీ(ఆసరా) గా పనిచేసిన ఎం కె వి శ్రీనివాసులు, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి , ఎమ్మెల్యేలు శిల్పచక్రపాణి రెడ్డి , తోగూరు ఆర్థర్ ఇతర నాయకులు అధికారులు పాల్గొన్నారు.