
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ను ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.
పాణ్యం ( సీమ కిరణం న్యూస్) ఏప్రిల్;- 7
పాణ్యం నియోజకవర్గ కేంద్రమైన పాణ్యం గ్రామం నందు పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ను పాణ్యం ఎమ్మెల్యే మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ ల్యాబ్ ను పాణ్యం ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంచుకుని నూతన అధ్యయనాలను చేసి అటు పాఠశాలకు ఇటు అధ్యాపకులకు ముఖ్యంగా పాణ్యం మండలానికి కి మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు కోరారు. అనంతరం అధ్యాపకులు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ని పూలమాలలు , శాలువాలతో సన్మానించి మొమెంటో ను అందజేశారు . ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్ రెడ్డి, ఎం పీ డీ వో దస్తగిరి , ఎం ఈ ఓ కోటయ్య, ఎంపీపీ హుస్సేన్ బి, సర్పంచ్ మేకల పల్లవి, వైయస్ఆర్ సీపీ నాయకులు కరుణాకర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి , పాలెం చంద్రారెడ్డి ,చందమామ బాబు, చందమామ రాజా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.