డోన్ మండలం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గొల్గత చెర్చి నందు సమావేశం
డోన్ టౌన్, ఏప్రిల్ 7,(సీమ కిరణం న్యూస్):
డోన్ మండలం ఫాస్టర్ల సమావేశం నిర్వహించారు, స్థానిక పట్టణంలోని కొండమీద వెల్ఫేర్ ఫాస్టర్స్ సమావేశంలో పండుగ వాతావరణం ఏర్పడింది,
పండుగనితలపించిన డోన్ మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పపట్టణంలోని కొండమీద గల గొల్గత చెర్చి నందు గురువారం డోన్ స్థానిక సంఘ కాపరి ఆనంద్ ఆధ్వర్యంలో డోన్ మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం ఘనంగా నిర్వహించారు. రెండవ కార్యవర్గ ఎన్నిక తరువాత రెండవదైన ఈ సమావేశములో అనేక కొత్త పాత దైవసేవకుల హాజరుతో పండుగ వాతావరణం నెలకొల్పబడింది. ఈ సందర్భంగా ప్రెసిడెంటు యం. ఆనందరావు మాట్లాడుతూ మండల, గ్రామా ప్రాంతాలలో ఉన్న సేవకులు ప్రతినెలా సమావేశమునకు హాజరు సభ్యత్వము కలిగివుండి. రాబోవురోజులలో అసోసియేషన్’ ద్వారా ఎన్నో సంక్షేమ ఫలాలు పొందవచ్చన్నారు. వైస్ ప్రెసిడెంటు రెవ,సామ్యోల్ గారు మాట్లాడుతూ పాస్టర్స్ కమిటిలో తమ నమ్మకత్వమును కొనసాగించు కొనువారు., భవిష్యత్ కాలములో ఉన్నతమైన బాధ్యతలో నియమించబడుతారని తెలిపారు, హానరబుల్ ప్రెసిడెంటు బందెల రాజు గారు మరియు సెక్రటరీ ఉదయ్ కుమార్ గార్లు., గత కమిటి వారిని శాలువాలు కప్పీ పూలమాలలతో ఘనంగా సన్మానించారురించారు. ఈ సమావేశంలో డోన్ యం ఈ ఓ ప్రభాకర్ గారు పాల్గొని దైవ సేవకులకు గ్రీటింగ్స్ తెలియజేశారు. కార్యక్రమంలో సమైఖ్య సంఘ సెక్రెటరీ సాల్మన్ , వైస్ ప్రెసిడెంటు అమృత్ రాజ్, ట్రెజరర్ ఇస్సాక్ మరియు మండల పాస్టర్స్ కమిటి ట్రైజరర్ మాణిక్యం రెడ్డి, జాయింట్ సెక్రెటరీ వై. విజయ్ కుమార్ మరియు 30 మంది పాస్టర్లు పాల్గొన్నారు. అనంతరం పాస్టర్లు డోన్ పట్టణం, మండల పరిధిలోని గ్రామాల కొరకు, అధికారులు కొరకు ప్రార్థనలు చేసారు.