అప్రకటిత విద్యుత్ కోతలు ఎత్తివేయాలి – సిపిఎం
ఆత్మకూరు, ఏప్రిల్ 07, (సీమ కిరణం న్యూస్ ) :
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదని చెప్పిన ముఖ్యమంత్రి అధికారం చేపట్టాక విద్యుత్ చార్జీల పెంపు అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరికాదని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి రణధీర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ప్రజలకు విద్యుత్తును తక్కువ ధరకే అందిస్తున్నాయి కానీ మన రాష్ట్రంలో మాత్రం వేలా పాల లేని విద్యుత్ కోతలతో ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటే మరోవైపు గోరుచుట్టుపై రోకటి పోటులా రూ.4,300ల కోట్లు భారాన్ని ప్రజలపై భారం వేయడం సరికాదన్నారు. అలాగే పట్టణాలలో వేళాపాళా లేకుండా విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు దొంగల బెడద ఎక్కువగా ఉంది దీనికి తోడు దోమల బెడద ఉండడంతో విషజ్వరాల బారిన పడుతూ వైద్యం కొరకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అంతేకాకుండా విద్యుత్ శాఖ ఉద్యోగుల కు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా ఇతర బకాయిలకు మళ్ళించడం సబబు కాదని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి అప్రకటిత విద్యుత్ కోతలు ఎత్తివేసి పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులు అందరికి జీతాలు వెంటనే చెల్లించాలని సిపిఎం పార్టీ గా వారు కోరారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు స్వాములు, రామ్ నాయక్, సురేంద్ర, రోషన్ తదితరులు పాల్గొన్నారు.