హజరత్ వారి దర్గా లో ఇస్తారి పంపిణీ
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఏప్రిల్ 08, (సీమకిరణం న్యూస్) :
పవిత్ర రంజాన్ నెల ను పురస్కరించుకొని ఉపవాసాలు చెల్లించే వారికి ఏఎస్ పేట లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ సయ్యద్ ఖాజా రహంతుల్లా నాయబ్ రసూల్ స్వాములవారి దర్గాలో ఉపవాసాలు ఉండే భక్తులు స్థానికులకు పలు ఏర్పాట్లు చేశారు ఉపవాస దీక్షుల కొరకు ఏర్పాటు చేసిన ఫలాలను ఉప పీఠాధిపతి షా గులాం నక్ష్ బంద్ జూనేద్ పాషా పర్యవేక్షణలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దర్గా ఉప పీఠాధిపతి మాట్లాడుతూ దర్గా పీఠాధిపతి ఆదేశాలతో తెల్లవారుజామున 4 గంటలకు సహరి అన్నదానం, సాయంత్రం 6 గంటలకు ఇఫ్తార్ ఫలాల పంపిణి అన్నదాన ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. రంజాన్ నెల మొదటి శుక్రవారం సందర్భంగా ఉపవాసాలు చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవడం తో వారికి సరిపడా ఇస్తారి ఫలాలను అందజేసినట్లు ఉప పీఠాధిపతి తెలిపారు ఈకార్యక్రమంలో దర్గా అకౌంట్ షేక్ ఖాజా హుస్సేన్, ఎస్ జిఎన్ ఖలీల్ ఇతర దర్గా సిబ్బంది పాల్గొన్నారు