పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

పెద్దవడగూరు పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
పెద్దవడగూరు, ఏప్రిల్ 08, (సీమకిరణం న్యూస్) :
పెద్దవడగూరు పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆకస్మిక తనిఖీ చేశారు. ఉమెన్ హెల్ప్ డెస్క్ , రికార్డుల నిర్వహణ, పోలీసుస్టేషన్, పరిసరాలను పరిశీలించారు. పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోని శాంతిభద్రతల గురించి తాడిపత్రి డీఎస్పీ చైతన్య, ఇతర పోలీసు అధికారులతో చర్చించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండకూడదు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పని చేయండి. అక్రమ మద్యం, నాటు సారా అక్రమాల కట్టడి కోసం ప్రత్యేక నిఘా వేయాలని సూచించారు. జిల్లా ఎస్పీతో పాటు డీఎస్పీ చైతన్య, ఎస్సై రాజశేఖర్ రెడ్డి, తదితరులు వెళ్లారు.