హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్ కు ఘన స్వాగతం
– ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరించిన సిఎం జగన్
కర్నూలు కలెక్టరేట్, నంద్యాల, ఏప్రిల్ 08, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని
శుక్రవారం నంద్యాల జిల్లాలో లాంఛనంగా ప్రారంభించడానికి కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి నంద్యాలకు చేరుకున్న సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎంపి, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపి పొచా బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా భగీరథ రెడ్డి, ఇషాక్ భాష, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల బిజంద్రనాథ్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఆర్తర్ లతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, లబ్బి వెంకటస్వామి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి, మంత్రి గుమ్మనూరు జయరాం, మార్క్ ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ట్రాన్స్ కో డైరెక్టర్ డాక్టర్ శశికళ రెడ్డి, కర్ర హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి శిల్పా నాగిని రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబునిశా, వైస్ చైర్మన్ లు గంగిసెట్టి శ్రీధర్, పాంషావలి, మాజీ చైర్మన్ దేశం సులోచన, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ నౌమాన్, పట్టణ ప్రముఖులు, తదితరులు పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు. సీఎం జగన్ వెంట మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిలు వచ్చారు.