BREAKING NEWSCRIME
వెదుర్ల ఆటో స్వాధీనం

వెదుర్ల ఆటో స్వాధీనం
రుద్రవరం, ఏప్రిల్ 08, (సీమకిరణం న్యూస్) :
రుద్రవరం నల్లమల అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా వెదుర్లను తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఆలమూరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి మక్తర్ భాష తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రేంజ్ అధికారి శ్రీమతి నాయుడు ఆదేశాల మేరకు నల్లమల అటవీ ప్రాంతం నుంచి వెదురు అక్రమ రవాణా అవుతోందని సమాచారం అందడంతో ఆర్ కృష్ణాపురం దగ్గర నిఘా ఉంచామన్నారు. అహోబిలం గ్రామానికి చెందిన బంకు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బాచుపల్లి గ్రామంలో వెదురును ఆటోలో లోడ్ చేసుకొని పొద్దుటూరు కి తరలిస్తుండగా మార్గ మధ్యలో వెదురు తరలిస్తున్నఆటోను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆటోను పరిశీలించగా దాదాపు 200 దాక వెదురు ఉందన్నారు. ఆటోను రుద్రవరం ఫారెస్ట్ కార్యాలయానికి తరలించామన్నారు.




