
సిఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన అంజాద్ అలీ, పువ్వాడి భాస్కర్
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ పట్టణ అధ్యక్షులు అంజాద్ అలీ , వైసిపి నాయకులు పువ్వాడి భాస్కర్,
ఆత్మకూరు టౌన్, ఏప్రిల్ 08, (సీమకిరణం న్యూస్) :
2017 ఉప ఎన్నికల్లో నంద్యాల ఎస్పీజీ మైదానం నుండే నంద్యాల జిల్లా కేంద్రంగా ప్రకటిస్తానని మాట ఇచ్చి నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వైసిపి నాయకులు పువ్వాడి భాస్కర్, వైసీపీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు అంజాద్ అలీ ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం జగనన్న వసతి దీవెన మూడవ విడత ప్రారంభోత్సవ సందర్భంగా నంద్యాల జిల్లాకు మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నంద్యాల డిగ్రీ కాలేజ్ హెలిప్యాడ్ వద్ద వీరు మర్యాదపూర్వకంగా కలుసుకుని ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నంద్యాలను జిల్లాగా ప్రకటించి నంద్యాల జిల్లా ప్రజల కలను నిజం చేయడం సంతోషకరం అన్నారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ గా మార్చినందుకు సిఎం జగన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రికి తెలియజేశారు.