మాట ఇస్తున్నా…ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి అడిగినవి అమలు చేస్తా
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
కర్నూలు కలెక్టరేట్, నంద్యాల, ఏప్రిల్ 08, (సీమకిరణం న్యూస్) :
సభావేదికపై ముఖ్యమంత్రి హోదాలో మాట ఇస్తున్నానని తక్షణమే ఎమ్మెల్యే అడిగిన కోరికలను అమలు చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. నంద్యాలను జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా నంద్యాలకు వచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం నంద్యాల పట్టణంలో ఎస్పీజీ గ్రౌండ్ నందు ఏర్పాటుచేసిన బహిరంగ సభ వేదికపై ఉపన్యసించారు.కాగా 2017 వ సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సభావేదికపై నంద్యాలను జిల్లాగా ప్రకటించడం జరుగుతుందని వాగ్దానం చేశాను. ఆ మాట ప్రకారమే నంద్యాల జిల్లాగా ప్రకటించాను. కాగా ఈ రోజు నా స్నేహితుడైన నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి కోరిక మేరకు అభివృద్ధి చేయడానికి హామీ ఇస్తున్నాను. అందువల్ల నంద్యాల ఆటోనగర్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి మోడల్ ఆటో నగర్ గా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. అలాగే నంద్యాల జిల్లాలోఉన్న మిరప రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి క్షేమం కోసం నంద్యాల లోనే మార్కెటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మిరప రైతులు సుధీర ప్రాంతమైన గుంటూరు జిల్లాకువెళ్లి రావడానికి ఇబ్బందులు పడుతున్న అందువల్ల ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నంద్యాలలో మిరప రైతులు మార్కెటింగ్ జరుపుకునేలా తప్పనిసరిగా ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నాను.. ప్రధానంగా జాతీయ రహదారిలో గ్రామీణ ప్రాంత రహదారులను 12 కిలోమీటర్లు కలిపితే రింగ్ రోడ్డు ఏర్పాటవుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యే కోరిక మేరకు ఏర్పాటు చేస్తానని ఇదే సభావేదికపై మరొకసారి హామీ ఇస్తున్నాననీ తెలిపారు. ఈ సభావేదికపై జిల్లా కలెక్టర్ మజీద్ జిలాని సమున్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.