జిల్లా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్) :
జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు శ్రీరామనవమి శుభాకాంక్షలను శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సత్యం, ధర్మం, న్యాయమే మార్గాలుగా సర్వమానవ సంక్షేమ పాలన సాగించిన పరమ పావనమూర్తి శ్రీరామచంద్రుడు అన్నారు. ధర్మం, దైవిక సూత్రాలకు అనుగుణంగా మానవులు తమ జీవితాన్ని ఏలా సార్ధకం చేసుకోవాలన్న విషయాన్ని శ్రీరాముడు తన జీవనం ద్వారా మనకు బోధించాడని అన్నారు. శ్రీ రాముడు కరుణ, సౌమ్యత, దయ, నీతి, చిత్తశుద్ధిల స్వరూపంగా నిలుస్తాడన్నారు. ధర్మం, ప్రేమ, సత్యంతో కూడిన జీవితాన్ని గడపడానికి శ్రీరాముడు మనకు మార్గదర్శకత్వం వహించాలని ప్రార్థిస్తున్నానన్న జిల్లా కలెక్టర్, ‘శ్రీరామ నవమి’ పండుగ ప్రతి ఇంట సంతోషకరంగా సాగాలని ఆకాంక్షించారు. రామచంద్రుడి కరుణ, ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని వారు ఆకాంక్షించారు.