ANDHRABREAKING NEWS

సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించండి

సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించండి :  ఎంపీపీ పద్మజా రెడ్డి

నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్) :

అనుమసముద్రంపేట స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పద్మజా రెడ్డి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించాలిని తెలిపారు. ప్రభుత్వ వైద్య అధికారులు మంజులమ్మ,రంతున్నిసభేగం, మాట్లాడుతూ మండలంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. వారంలో మంగళ,బుధ, శనివారాల్లో ప్రత్యేక వైద్యాధికారులు వస్తున్నారని ఆ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రజనీకాంత్ ఈవోపీఆర్డీ ప్రసాద్ ఏ ఓ శ్రీనివాసులు, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ భాష, రాజోలు సొసైటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎస్ పేట సర్పంచ్ భర్త జిల్లాని భాష, తదితరులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!