వామ్మో గంటలు తడబడి కరెంటు కోతలు
రాష్ట్ర టిడిపి కార్యదర్శి దావా పెంచల రావు
వామ్మో … గంటలు తడబడి కరెంటు కోతలు…
అంధకారంలో పలు గ్రామాలు..
పట్టించుకోని అధికారులు…..
రాష్ట్ర టిడిపి కార్యదర్శి దావా పెంచల రావు
ఆత్మకూరు, సంగం, ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్) :
వామ్మో…. నెల్లూరు జిల్లా మండల, పలు గ్రామాల్లో హద్దు అదుపు లేకుండా ఎటువంటి ప్రకటన లేకుండా గంటల తరబడి విద్యుత్ కోతలు తీయడం దారుణమని రాష్ట్ర టిడిపి కార్యదర్శి దావా పెంచలయ్య పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రమైన సంఘం టిడిపి కార్యాలయంలో విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నరనీ ఆయన ఆవేదన చెందారు. మండల , ఆత్మకూరు కేంద్రంతోపాటు ఇక పల్లెల్లో చెప్పనక్కర్లేదు . కరెంట్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు తీస్తారో ఎంత ఎంత సమయం పడుతుందో ఎన్ని గంటల్లో ఇస్తారో తెలియని పరిస్థితి ఏర్పడిందని జిల్లా,మండల ప్రజలు వాపోతున్నారుఅని తెలియజేశారు. దీంతో ఇటు విద్యార్థులు, పరీక్షా కాలం, అటు రంజాన్ ఉపవాసాలు సమయం,మరోవైపు చంటి పిల్లల తల్లులు,గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఈ వేసవి తాపం తట్టుకోలేక జనాలు ఆవేశం కట్టలు తెంచుకొని ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఏప్రిల్ మొదటి వారానికి కోత విధింపు రానున్న వేసవి కాలంలో ఇంకెంత కోత విధిస్తారో అని భయాందోళనలో ప్రజలు సంబంధిత అధికారులుస్పందించి విద్యుత్ కోతలు లేకుండా దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని.మండల,జిల్లా ప్రజలు వేడుకుంటున్నారు.