ప్రజాసేవలో వాగాల పుల్లయ్య సేవలు మరువలేనివి
ప్రజాసేవలో వాగాల పుల్లయ్య సేవలు మరువలేనివి
నెల్లూరు, ఆత్మకూరు, ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్) :
శ్రీ క్రీస్తు శేషులు వాగాల పుల్లయ్య 24వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కుమారుడు వాగాల శ్రీహరి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని పమిడిపాడు ఎస్ టి గిరిజన కాలనీ యందు సుమారు 70 కుటుంబాల వారికి అన్నం ప్యాకెట్ మరియు అరటి పండ్లు మరియు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. పై కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు మున్సిపాలిటీ కమిషనర్ ఎం రమేష్ బాబు హాజరై మాట్లాడుతూ స్వచ్ఛంద సేవ లో నిర్విరామ సేవ చేస్తూ అమరులైన కీర్తిశేషులు పుల్లయ్య ఆసయా సాధన కొరకు కుటుంబ సభ్యులు 24 సంవత్సరములుగా కృషి చేస్తున్నందుకు వారి కుమారులను అభినందించడం జరిగింది.మరియు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు సి ఐ టి యు రాష్ట్ర నాయకులు జి వి ఎస్ ప్రసాద్ హజరత్ అయ్యా కొండ మురహజరత్ అయ్యా కె వి పి ఎస్ జిల్లా నాయకులు ఏ నాగయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మి పతి మాట్లాడుతూ ఇన్ని ఏళ్ళు గడిచిన ప్రజాక్షేత్రంలో వాగాల పుల్లయ్య సేవలను మరువలేనివని పుల్లన్న ఆశయాలను కొనసాగించాలని కోరడం జరిగింది.. పెంచల నరసింహం బ్రహ్మ నాయుడు కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. తొలుత వాగాల పుల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తమ దాన కార్యక్రమం నిర్వహించారు.