సిఎం జగన్ వాడిన భాష బాధాకరం :
నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి
నంద్యాల టౌన్, ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ప్రతిపక్షనేత, మీడియానుద్దేశించి వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి బహిరంగసభలో నా వెంట్రుక ఎవరూ పీకలేరని, ప్రతిపక్షనేతలు గుండెపోటుతో టికెట్ తీసుకుంటారని మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదన్నారు. వైసిపి ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక అనేక ప్రజా వ్యతిరేక పనులు చేసి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న ప్రెస్టేషన్ తో మాత్రమే మాట్లాడినట్లు ఉందన్నారు. బహిరంగ సభలో ఎమ్మెల్యే అబద్దాల చిట్టా హస్యాస్పదమని, టిడిపి ప్రభుత్వం అదికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను తామే చేసినట్లు చెప్పుకోవడం తామేదో చేస్తుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటున్నట్లు పదే పదే ఎమ్మెల్యే శిల్పా చెప్పు కోవడం హాస్యాస్పదంగా ఉందని భూమా ఎద్దేవా చేశారు. బహిరంగసభా వేదికగా ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ప్రజలు విని నవ్వుకుంటున్నారన్నారు. ఆటోనగర్ ను అప్పటి ఎంపి భూమానాగిరెడ్డి, అప్పటి మంత్రి పరూఖ్ తొలుత ఏర్పాటుచేశారని ఉప ఎన్నికల సందర్బంగా వారికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను తెలుగుదేశం ప్రభుత్వం చేసిందన్నారు. వైసిపి ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి అదే ఆటోనగర్ వాసులకు పట్టాల రిజిస్ట్రేషన్ అంటూ హంగమా చేయడం తప్ప ఆటోనగర్ కు చేసిందేమీలేదన్నారు. తాను అదికారంలో ఉన్నప్పుడు రూ.45 కోట్లతో అంతర్గత రహదారులు నిర్మించామని మరో 15కోట్లతో ఆటోనగర్ లో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు సర్వం సిద్దం చేయగా మునిసిపల్ పరిదిలో లేనందున అనుమతి లబించలేదన్నారు. ఆ ప్రక్రియను తామే ప్రారంభించామని ఈలోపు ఎన్నికలు రావడం వైసిపి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిందన్నారు. నంద్యాలలో ముస్లిం మైనారిటికి చెందిన వ్యక్తిని వేదించి కేసులు నమోదు చేస్తే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎవరు కేసులుపెడితే జరిగిందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం తరుపున పోటీచేసిన వారిపై కేసులు పెడతామని బెదిరించి విత్ డ్రాలు చేసింది ఎవరో ప్రజలకు తెలుసని, తామోదే కేసులుపెట్టలేదని బహిరంగ సభలో వ్యాఖ్యలు చేయడం గురివింద సామెతేనని ఈసందర్బంగా భూమా ఘాటుగా విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకోసం ఏదైనా పనులుచేసి ప్రజల మెప్పు పొందాలని ప్రెస్టేషన్ తో ఏదో మాట్లాడే విదానానికి ఎమ్మెల్యే స్వస్తి పలకాలని భూమా బ్రహ్మానందరెడ్డి హితవు పలికారు.