రాష్ట్రానికి దిష్టి బొమ్మగా మారిన జగన్ రెడ్డి
నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు లక్ష్మి నరసింహ
రాష్ట్రానికి దిష్టి బొమ్మగా మారిన జగన్ రెడ్డి
– ముఖ్యమంత్రి స్థాయిలో చిల్లర మాటలా
– నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు లక్ష్మి నరసింహ
నంద్యాల టౌన్, ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్రానికి జగన్ రెడ్డి దిష్టి బొమ్మగా మారారని, ముఖ్య మంత్రి స్థాయిలో చిల్లర మాటలు మాట్లాడటం తగదని, వెంట్రుక పీకలేరంటున్న జగన్ రెడ్డికి గుండు కొట్టించి సున్నపు బొట్లు పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు లక్ష్మి నరసింహ పేర్కొన్నారు. శని వారం నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ అసమర్ధత, అభద్రత, అవినీతి పాలనతో జగన్ రెడ్డి రాష్ట్రానికి దిష్టిబొమ్మగా మారారని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ రాష్టాన్ని అగాధంలో నెట్టారని విమర్శించారు. వెంట్రుక పీకలేరంటూ అత్యంత జుగుప్సాకరమైన బజారు భాష మాట్లాడటం జగన్ రెడ్డిలో నెలకొన్న అసహనానికి, దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తక్షణమే ప్రతిపక్షాలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త మంత్రులు వచ్చినా రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. వీధుల్లో పోరాటాలు హస్తినలో సాష్టాంగ నమస్కారాలు పెట్టడం, 23 మంది ఎంపీలతో ప్రత్యేక హోదా సాధించారా అని నిలదీశారు. జగన్ రెడ్డి వచ్చాక ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత మాత్రం దక్కించుకున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.