కర్నూలు జిల్లా భవిష్యత్తును కాపాడండి

కర్నూలు జిల్లా భవిష్యత్తును కాపాడండి
-: షెడ్యూల్ ట్రైబ్ ఫెడరేషన్
రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్
ఓర్వకల్లు, ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్) :
ప్రతిసారి జరిగినటువంటి రాష్ట్ర విభజన సమయాల్లో ఒక్క కర్నూలు జిల్లాకు మాత్రమే తీరని అన్యాయం జరుగుతుందని, ప్రస్తుతం జరిగిన జిల్లాల విభజన లోనూ తీరని అన్యాయం జరిగిందని షెడ్యూల్ ట్రైబ్ ఫెడరేషన్
రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ ఆరోపించారు. శనివారం ఆయన మండల కార్యాలయ ఆవరణంలో షెడ్యూల్ ట్రైబ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు నేనావత్ రాము నాయక్ తో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కైలాస్ నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నమన్నారు. కర్నూలు జిల్లా ఎప్పుడూ కోల్పోవడమే తప్పా జిల్లాకు మిగిలింది ఒకే ఒక్క కొండా రెడ్డి బురుజు ఎగిరే గాలిపటం మాత్రమేనన్నారు. భవిష్యత్తు లో జిల్లాకు ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తుందనిమనం ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ విషయంలో సుదీర్ఘ రాజకీయ నాయకులు, మేధావులు భవి ష్యత్తు కార్యాచరణపై ఓ కింత ఆలోచించక పోవడం విశేషం. మేధావులు ,ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా సంయుక్తంగా పోరాడి జిల్లా భవిష్యత్తును కాపాడవలసిన ఆవశ్యకత ఎంతైనా మన మీద జిల్లా ప్రజల మీద ఉందన్నారు. ఇందులో సీనియర్ పాత్రికే యులు కూడ సహకరించాలని అయన కోరారు. పాలన వికేంద్రీకరణ కోసం ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని, కాకపోతే కొన్ని విషయాల్లో కొన్ని ప్రాంతాలు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి కూడా గమనించవలసి ఉంది. ఇందులో ప్రధానంగా నంద్యాల జిల్లాలో ప్రాచీన శైవ క్షేత్రాలు సాగునీటి ప్రాజెక్టులు విద్యా సంస్థలు శ్రీశైలం దేవస్థానం, శ్రీశైలం ప్రాజెక్టు ,సప్త నదుల సంగమేశ్వరం, మహానంది, అహోబిలం, యాగంటి, రుద్రకోడూరు, ఓంకారం, మద్దిలేటి స్వామి, నల్లమల్ల ఫారెస్ట్, తెలుగు గంగ, వెలుగోడు రిజర్వాయర్, పోతిరెడ్డిపాడు రిజర్వాయర్, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్, కుందు నది, వరి పంట పండే భూములు, సిమెంటు ఫ్యాక్టరీలు, బ్రహ్మంగారిమఠం ఇవన్నీ కూడా నంద్యాల జిల్లాకే పరిమితమైనది.