బేడ బుడగ జంగాల కులానికి రిజర్వేషన్ హక్కులు కల్పించాలి
బేడ బుడగ జంగాల కులానికి రిజర్వేషన్ హక్కులు కల్పించాలి..
-: రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్
వెల్దుర్తి , ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్) :
బేడ బుడగ జంగాల కులానికి రిజర్వేషన్ హక్కులు కల్పించా లని ఆ సంఘం రాష్ట్ర అధ్య క్షుడు తూర్పాటి మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం మండల కేంద్రమైన
వెల్దుర్తిలో బేడ బుడగ జంగాల కాలనీ లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ 14 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో బేడ బుడగ జంగం కులమునకుషెడ్యూల్ రాజ్యాంగంలోని హక్కులు హరించ బడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధికంగా జనాభా, ఉద్యోగ, రాజకీయంగా, లేకపోవడమే ఇందుకు నిదర్శనం. కానీ అంబేద్కర్ వాదులు కూడా
ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ , షెడ్యూల్ రాజ్యాంగం ప్రకారం బేడ బుడగ జంగం కులం ఉన్నప్పటికీ, ప్రాంతీయ వ్యత్యాసాలు చూపిస్తూ, ఈ సంచార దళిత అణగారిన కులానికి న్యాయబద్ధమైన రిజర్వేషన్లు హక్కులు అందిం చడంలో అన్యాయం చేస్తున్నారన్నారు. వీటికి సంబంధించిన కమిషన్ రిపోర్ట్స్, ప్రభుత్వ నివేదికలు అనుకూలంగా ఉన్నప్పటికీ, న్యాయం జరగడం లేదని వాపోయారు. వీటి కొరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి బేడ బుడగ జంగం కులానికి న్యా యం చేస్తామని హామీ ఇచ్చిన ప్పటికీ నెరవేర్చడం లేదన్నారు . వీటిపైఅసెంబ్లీ,పార్లమెంటులోనూ, చర్చలు జరుగుతున్న, న్యాయం జరగడం లేదని, సంఘం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షుడు ఈ బుద్ధి బాలు, బాలరాజు, మద్దిలేటి, జమ్మన్న, గణ మద్దిలేటి, రవి,రమణ గురు,రంగన్న,ఎల్లయ్య,
తదితరులు పాల్గొన్నారు.