అంధకారప్రదేశ్ గా మార్చిన ఘనత ప్రభుత్వానిదే
అంధకారప్రదేశ్ గా మార్చిన ఘనత ప్రభుత్వానిదే :
ఆలూరు ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ
చిప్పగిరి, ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ ను అంధకార ప్రదేశ్ గా మార్చిన ఘనత ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ అన్నారు. శనివారం ఆలూరు నియోజకవర్గం లోని మండల కేంద్రమైన చిప్పగిరి లో అనధికారిక విద్యుత్ కోతలపై టిడిపి మండల కన్వీనర్ షేక్షావలి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోతల లేని కరెంటును సరఫరా చేస్తామని చెప్పి ఇప్పుడు అనధికారికంగా ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు కోతలు నిర్వహిస్తూ గ్రామాలలో ప్రజలను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ అనధికారిక కరెంటు కోతల వల్ల చదువుకునే విద్యార్థి విద్యార్థినులు, వ్యవసాయ రైతులు, గృహాలలో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్న ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టినట్లు వ్యవహరిస్తూ ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు కోతలు విధిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ ఉందని వారి ప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అనధికారిక కరెంటు కోతలను తక్షణమే ఆపేసి సక్రమంగా 24 గంటలు కరెంటు సరఫరా చేయాలని లేనియెడ ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిప్పగిరి మాజీ జడ్పిటిసి సభ్యులు ఏరూరు మీనాక్షి నాయుడు, మాజీ మండల కన్వీనర్ లు నగర డోనా కిష్టప్ప, భీమ లింగప్ప,కుందన గుర్తి సర్పంచ్ కొండా పురుషోత్తం, బంటనహళ్ సర్పంచ్ సుశీలమ్మ, బెల్డోనా సర్పంచ్ కరివేముల సావిత్రి, చిప్పగిరి ఎంపీటీసీ సభ్యులు రజనీ , మాజీ మండల ఉపాధ్యక్షులు వెంకటేష్, గుమ్మనూరు హంపయ్య, రాము, రామాంజనేయులు, అమరేష్ , సురేష్, గోవిందు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.