BREAKING NEWSCRIME
ఆర్టీసి బస్.. బైక్ ఢీ.. ఒకరి మృతి
ఆర్టీసి బస్ బైక్ ఢీ కొని ఒకరి మృతి..
కామారెడ్డి, ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్) :
కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్ల రోడ్ లో ఆర్టీసీ బస్, బైక్ ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయసు గల సంతోష్ రెడ్డి గా గుర్తించారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణ సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్.కె కళాశాలలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం సంతోష్ రెడ్డి విధులు ముగించుకుని స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా పట్టణ శివారులోని సిరిసిల్ల రోడ్డు లోని వాగు సమీపంలో ఆటోను ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో సంతోష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం సంతోష్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి సమీక్షించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.