ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్..
కామారెడ్డి, ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్) :
కామారెడ్డి నియోజికవర్గంలోని 19 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 04 లక్షల 86 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 1,211 మందికి 7 కోట్ల 69 లక్షల 82 వేల 300 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలను గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలో ఇచ్చిన పత్రాలను సకాలంలో తమ కార్యాలయంలో ఇచ్చినట్లైంతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు ఇప్పించే విధంగా చూస్తామని ఆయన అన్నారు.