TELANGANA
రథాల రామారెడ్డి లో బ్రహ్మోత్సవాలు
కళ్యాణానికి ముస్తాబైన శ్రీ సీతారామచంద్ర స్వామి. రాజరాజేశ్వర స్వామి ఆలయంలు
కళ్యాణానికి ముస్తాబైన శ్రీ సీతారామచంద్ర స్వామి. రాజరాజేశ్వర స్వామి ఆలయంలు
రథాల రామారెడ్డి లో బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాలు పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
పోస్టర్ ఆవిష్కరించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్
కామారెడ్డి జిల్లా /రామారెడ్డి మండలం, ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్) :
2, 4, నుండి e19, 4, 2022 బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతాయి.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రథాల రామారెడ్డి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవవేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల ఉగాది నుండి ప్రారంభమై 19వ తేదీ మంగళవారం రోజు ముగుస్తాయి.
ముఖ్యకార్యక్రమాలు..
ఈ నెల 10 వ తారీఖు రోజు ఆదివారం *శ్రీసీతా రామ చంద్ర స్వామి కళ్యాణం*
12 వ తారీకు రోజు మంగళవారం గరుడ సేవ, నర నంది సేవ కార్యక్రమం.
14 వ తారీకు రోజు గురువారం *శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణం*
13వ తేదీ రోజు ఆదివారం ఉదయం ఐదు గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి రాజరాజేశ్వర స్వామి దేవుళ్ళ ఊరేగింపు మరియు రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది.
రతలరామారెడ్డి గ్రామంలో నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమైన ఉత్సవాలు 20 రోజులపాటు శ్రీ సీతారామచంద్రస్వామి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం పూజ కార్యక్రమం మొదలు కొని ఉదయం 9 గంటలకు సేవ గ్రామంలో ఊరేగింపుగా నిర్వహిస్తారు బాజాభజంత్రీలతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని 20 రోజులు రథాల రామారెడ్డి గ్రామంలో పండుగ వాతావరణం భక్తిశ్రద్ధలతో మంగళ హారతులతో ప్రతిరోజు శ్రీ సీతారామచంద్రస్వామి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించేవారు ఆలయ కమిటీ అనుమతితో ప్రతిరోజు భార్య భర్తలు కుటుంబ సభ్యులు పురోహితులు పూజలు నిర్వహిస్తారు. 16, 4, 2022 రోజున శ్రీ సీతారామచంద్రస్వామి రాజరాజేశ్వర స్వామి రాత్రి 12 గంటలకు రథాల పై ఊరేగింపు ఊరేగింపుగా ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు రామారెడ్డి గ్రామము భక్తులతో కిటకిటలాడుతుంది. ఎటు చూసిన హరేరామ ఓం నమశ్శివాయ నినాదాలతో రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి వారం రోజుల ముందు రథాల రామారెడ్డి ఆవరణలో జాతర ఏర్పడుతుంది ఇతర గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులు ఈ యొక్క జాతరలో పాలుపంచుకునే శ్రీ సీతారామచంద్రస్వామి రాజరాజేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత వారు వారి గ్రామాలకు వెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా జాతరకు రామారెడ్డి గ్రామంలో ప్రతి కుటుంబంలో బంధుమిత్రులతో భక్తిశ్రద్ధలతో కుటుంబాలు ఉత్సాహంగా కళ్యాణ మహోత్సవం నుంచి రథోత్సవం వరకు పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఈ యొక్క ఉత్సవ కార్యక్రమానికి ఉత్సాహ కమిటీ ఆధ్వర్యంలో మరియు రామారెడ్డి గ్రామస్థుల సహకారంతో యువకుల సహకారంతో. అన్నదాన కార్యక్రమం ఏర్పాటుకు దాతలు వారికి తోచినంత అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క మొక్కులను తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఉత్సవ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు