హోంగార్డు ను కొట్టి చంపిన దుండగులు
-: ఆకతాయిల కోసం వేట ప్రారంభించిన పోలీసులు
నంద్యాల క్రైమ్, ఏప్రిల్ 11, (సీమకిరణం న్యూస్) :
గోదాము వద్ద మద్యం తాగవద్దన్నందుకు దుండగులు హోంగార్డు ను కొట్టి చంపిన ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది..వివరాల్లోకి వెళితే..
మృతుడు శిరివెళ్ల మండలం గుండంపాడు గ్రామ నివాసి కుమ్మరి శేఖర్ (42).మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. మృతుడి సోదరుడు సైతం ఆర్మీలో పని చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
సంఘటన నంద్యాల జిల్లా కేంద్రంలో జరగడం పట్ల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి కేసును ఛాలెంజ్ గా తీసుకుని ముద్దాయిలను అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం..