మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం
యస్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ నాయక్
యస్ టి యు ప్యాపిలి ఆధ్వర్యంలో మహాత్మా పూలే 195 వ జయంతి
ప్యాపిలి, ఏప్రిల్ 11, (సీమకిరణం న్యూస్) :
అంటరానితనం రూపుమాపడానికి,కుల వ్యవస్థను నిర్మూలించడానికి,అణగారిన వర్గాల అభ్యున్నతికి,మహిళా ఉద్ధరణ కోసం అహర్నిశలు పాటుపడిన భారత ప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు,రచయిత మహాత్మా జ్యోతిరావు పూలే, ఆదర్శనీయడు అని ఆయన అడుగుజాడలలో నేటి తరం నడిచి సమాజాభివృద్ధికి పాటుపడాలని యస్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ నాయక్ పేర్కొన్నారు. స్థానిక యస్ టి యు ప్యాపిలి ప్రాంతీయ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి మరియు జాతిపిత మహాత్మా గాంధీ సతీమణి,
స్వాతంత్ర్య సమరయోధురాలు, కస్తూరి బా గాంధీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించి,వారి జీవితంలోని విశేషాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో యస్ టి యుజిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ నాయక్,
యస్ టి యు ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి చిన్నపరెడ్డి, సోసియల్ మీడియా కన్వీనర్ మనోహర్,ఉపాధ్యాయ వాణి కన్వీనర్ శివ,శేషా నాయక్ తదితరులు పాల్గొన్నారు.