మహాత్మా జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలి
– నంద్యాల జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్
నంద్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 11, (సీమకిరణం న్యూస్):-
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ పిలుపునిచ్చారు. సోమవారం మహాత్మ జ్యోతిబా పూలే 196వ జయంతి సందర్భంగా స్థానిక పద్మావతి నగర్ సర్కిల్ లో జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మహాత్మా శ్రీ జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య, తాసీల్ధార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టేందు కు కృషి చేయాలన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలు, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం మహాత్మ జ్యోతిబాపూలే విశేషంగా కృషి చేశార న్నారు. అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రత్యేకంగా కృషి చేసిన మహనీయ వ్యక్తియని జిల్లా కలెక్టర్ కొనియాడారు.