బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే
రాయలసీమ మహిళ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ కార్యదర్శి రాయలసీమ శకుంతల
కర్నూలు టౌన్, ఏప్రిల్ 11, (సీమకిరణం న్యూస్) :
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని రాయలసీమ మహిళ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ కార్యదర్శి రాయలసీమ శకుంతల అన్నారు. సోమవారం జ్యోతి రావు పూలే జయంతి వేడుకలను స్థానిక అశోక్ నగర్ లోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహం లో నిరాశ్రయుల మధ్య ఘనంగా జరువుకున్నారు. ఈ సందర్బంగా రాయలసీమ శకుంతల మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గారు అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడని, విద్య, వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానతలను నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారని. పూలె గారు వితంతు పునర్వివాహం గురించి చైతన్యం తీసుకు వచ్చారని శూద్రులకు చదువు నేర్పించాల్సిన అవసరం ఉందని అప్పటి బ్రిటీష్ పాలకులతో పాఠశాలలు ఏర్పాటు చేయించారని కనుక సమాజంలో నిమ్న జాతులు, స్త్రీలు, కార్మికులు, కర్షకులు ఎలా దోపిడీకి గురవుతున్నారో ఎలా అణచివేయ బడుతున్నారో చూసి వారికి ప్రతిఘటన మార్గం చూపించారని ప్రతి ఒక్కరూ కృషి పట్టుదలతో పూలే గారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమ0 లో వసతి గృహ సంరక్షకురాలు లత శ్రీ, నిరాశ్రయులు పాల్గొన్నారు.