పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి.
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాసేలా చూడండి.
జాయింట్ డైరెక్టర్ మరియు పదవ తరగతి పరీక్షల రాష్ట్ర అబ్జర్వర్ మేరీ చంద్రిక
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 13, (సీమకిరణం న్యూస్) :
పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ డైరెక్టర్ మరియు పదవ తరగతి పరీక్షల రాష్ట్ర అబ్జర్వర్ మేరీ చంద్రిక సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని సునయన అడిటోరియంలో శ్రీమతి మేరీ చంద్రిక జాయింట్ డైరెక్టర్ మరియు పదవ తరగతి పరీక్షల రాష్ట్ర అబ్జర్వర్. కర్నూలు, నంద్యాల DEO లు రంగారెడ్డి, సత్యనారాయణ లు ఉమ్మడి జిల్లాలు కర్నూలు, నంద్యాల లో జరిగే 2022 పదవ తరగతి పరీక్షలు నిర్వహించు సిబ్బందికి వన్ డే ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. శ్రీమతి మేరీ చంద్రిక జాయింట్ డైరెక్టర్ మరియు పదవ తరగతి పరీక్షల రాష్ట్ర అబ్జర్వర్ మరియు DEO లు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలలో నిర్వహించే సిబ్బంది పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాసేలా చడాలని. పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని. పరీక్షలకు హాజరైన వారివి గైర్హాజరైన వారివి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు.
క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేటప్పుడు ఆన్సర్ పేపర్స్ తీసుకునేటప్పుడు పాటించవలసిన నియమాలను గురించి కూడా తెలియజేశామన్నారు ప్రోగ్రాంలో కోడింగ్ గురించి కూడా తెలియజేశామన్నారు. పరీక్ష కేంద్రాల్లో కి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. క్వశ్చన్ పేపర్స్ 23వ తేదీన ఆయా పోలీస్ స్టేషన్ కు చేరుతాయని అక్కడి నుంచి రూట్ ప్రకారంగా పరీక్ష కేంద్రాలకు చేరవేయడం జరుగుతుందన్నారు. సిబ్బంది అందరూ సమన్వయంతో వ్యవహరించి పదో తరగతి పరీక్షలను విజయవంతంగా జరుపుదామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సులోచన, ఏడి ప్రకాష్ రెడ్డి, ఎం ఈ ఓ లు, ప్రధానోపాధ్యాయులు, సి సి ఓ లు, ఏ సి ఓ లు ఇన్విజిలేటర్ స్ తదితరులు పాల్గొన్నారు.